నేతన్న సేవలో 10, 651 దరఖాస్తులు ఆమోదానికి: జిల్లా కలెక్టర్ శ్రీధర్

కడప(ఆగస్ట్, 7): 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కడపలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.  నేతన్న సేవలో.. పథకం కింద జిల్లాలో 10,651 దరఖాస్తులను ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు.  వీరిలో 8,713 మంది అర్హులుగా గుర్తించబడగా, వారికి రూ.21.78 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.  
*సహకార వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా జిల్లాలో ఐదు కొత్త చేనేత సహకార సంఘాలు నమోదు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో 9,247 మంది చేనేత కార్మికులకు రూ.4,000 చొప్పున పెన్షన్ అందిస్తోంది.  ముద్ర రుణ పథకం కింద 2025–26లో 368 మంది లబ్ధిదారులకు రూ.475.62 లక్షలు, 2026–27లో జూలై 31 నాటికి 26 మంది చేనేత కార్మికులకు రూ.34.40 లక్షల రుణాలు అందించారు.  200 యూనిట్ల వరకు చేనేత కార్మికులకు, 500 యూనిట్ల వరకు పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తోందని చెప్పారు.  జిల్లాలో 7,824 మంది చేనేత కార్మికులు, 122 మంది పవర్‌లూమ్ కార్మికులను గుర్తించి, జూలై 31, 2026 నుంచి ఉచిత విద్యుత్ సౌకర్యం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!