విద్యుత్ సబ్ స్టేషన్ ఆగుతుందా.. సాగుతుందా.? నెగ్గేదెవ్వరు?
ప్రొద్దుటూరు(జూలై, 23): శ్రీనివాసనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ పనులు నిలిపేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత అధికారులను ఆదేశించగా.. పనులు కొనసాగించాల్సిందేనని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పట్టుబట్టారు. దాంతో వివాదం నెలకొంది.
*ప్రొద్దుటూరు రెవెన్యూ గ్రామ రికార్డుల్లో శ్రీనివాసనగర్ SNo.534/5బి, 6బి, 7బిలో ప్రభుత్వ భూమిగా ఉన్న 2.49 ఎకరాలను జిల్లా కలెక్టర్ విద్యుత్ సబ్ స్టేషన్, మునిసిపల్ గదుల నిర్మాణాలకు ఇవ్వగా, 80% పనులు పూర్తయ్యాయి.
*ఈ స్థలంపై కొందరు కోర్టుకు వెళ్లగా, వారికి స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మద్దతుగా ఉన్నారు. ఆయన
జిల్లా ఇన్చార్జి మంత్రి ద్వారా సబ్ స్టేషన్ పనులు
నిలిపి వేయించారు. నిలిపేసిన పనులను పూర్తి చేయాల్సిందేనని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఈనెల 25న ధర్నాకు పిలుపునిచ్చారు.
*ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలతో పాటు, రెవెన్యూ, విద్యుత్, ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు సబ్ స్టేషన్ స్థల వివాదంపై అంతర్గత విచారణ చేపట్టారు.
*ప్రొద్దుటూరు సబ్ స్టేషన్ వివాదాన్ని మంత్రి లోకేష్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.