స్కూల్ బస్సుల డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై అవగాహన: MVI రవీంద్ర నాయక్

ప్రొద్దుటూరు(జూలై,14): రోడ్డు ప్రమాదాల నివారణపై మంగళవారం CBIT కాలేజీలో విద్యా సంస్థల బస్సు డ్రైవర్లకు పొద్దుటూరు ఇన్చార్జి RTO రవీంద్ర నాయక్ అవగాహన కల్పించారు.  
వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం తదితర అన్ని అవసరమైన పత్రాలను పరిశీలించారు. 
అలాగే బ్రేకులు, టైర్లు, లైట్లు, ఎమర్జెన్సీ డోర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ తదితర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ జయచంద్ర రెడ్డి, డైరెక్టర్ లోహిత్ రెడ్డి, ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్, స్కూల్ బస్సుల డ్రైవర్లు, రవాణా సిబ్బంది పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు, Proddatur, YSR Kadapa, Andhra Pradesh.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?