ఇండియన్ బ్యాంకులో నగదు కోసం తిప్పలు.!
ప్రొద్దుటూరు(జూలై, 27): ప్రొద్దుటూరు ఇండియన్ బ్యాంకులో సోమవారం నగదు కొరతతో, ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన ఖాతాదారులకు నగదు లేదని సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. బయటినుంచి నగదు తెప్పిస్తున్నామంటూ బ్యాంక్ అధికారులు ఖాతాదారులను సాయింత్రం వరకు వేచి ఉండేలా చేశారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతలేమిపై ఖాతాదారులు మండిపడుతున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.