వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష.!

కడప(జూలై 21): వాణిజ్య పన్నుల వసూళ్లపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాన ఆదాయ వనరులుగా నిలిచే పన్నులను బాధ్యతాయుతంగా సకాలంలో చెల్లించాలని సూచించారు.  ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లింపుపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
*ప్రొఫెషనల్ ట్యాక్స్ చట్టం ప్రకారం వ్యాపారులు, దుకాణాలు, కంపెనీలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు, గోదాములు, ఏటీఎంలు, బ్యాంక్ శాఖలు, ఫైనాన్స్ సంస్థలు, మొబైల్ టవర్లు తదితర వాణిజ్య, వృత్తి సంస్థలు తప్పనిసరిగా నమోదు చేసుకొని వర్తించే పన్నును ప్రభుత్వానికి చెల్లించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
*వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుమతి మాట్లాడుతూ.. జిల్లాలో జూన్ 2026 వరకు నికర రాష్ట్ర వస్తు సేవల పన్ను వసూళ్లలో గత ఏడాదితో పోలిస్తే 49.53 శాతం వృద్ధి రేటు నమోదైందని, ఇది జిల్లాకు గణనీయమైన పురోగతిని తీసుకువచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన లక్ష్యాలను కూడా గడువులోగా పూర్తి చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో రూ.246.98 కోట్ల ఆస్తులు పన్ను బకాయిలు ఉండగా, ఇప్పటివరకు రూ.17.74 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. 
*జిల్లాలో ప్రస్తుతం 21,539 వస్తు సేవల పన్ను నమోదిత వ్యాపారులు ఉండగా, ఈ ఏడాది ఇప్పటికే 274 కొత్త నమోదులు, 42 కొత్త సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నమోదులు జరిగాయని అధికారులు తెలిపారు. వృత్తి పన్ను పరిధిలో కూడా కొత్తగా నమోదులు పెరగడం ఆదాయ విస్తరణకు దోహదపడుతోందని వివరించారు.
 - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM |  Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం