అవినీతి అధికారులపై కేసులు నమోదు చేయాలి: మల్లెల ఝాన్సీ
ప్రొద్దుటూరు(జూలై 30): అవినీతి అధికారులందరిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాజీ ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని చెప్పారన్నారు. వారందరిపై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.