సోములవారిపల్లె గ్రామసభ ప్రశాంతం.!
ప్రొద్దుటూరు(జూలై 30): స్థానిక సోములవారిపల్లె గ్రామసభను గురువారం ప్రత్యేక అధికారి మంజుల ఆధ్వర్యంలో డిప్యూటీ ఎండిఓ రామాంజుల రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరసింహులు, రూరల్ పోలీస్ అధికారులు కలిసి ప్రశాంతంగా నిర్వహించారు. పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేయడంపై ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభను అధికారులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చి తమ అభిప్రాయాన్ని రిజిస్టర్లో నమోదు చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.