ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ధర్నాపై.. అంతటా చర్చ.!
ప్రొద్దుటూరు(జూలై, 24): ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శనివారం చేపట్టనున్న ధర్నాపై అంతటా చర్చ సాగుతోంది. ఇప్పటికే 80 శాతం పనులు జరిగిన స్థానిక శ్రీనివాసనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ ఎమ్మెల్యే శనివారం ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నాను నిలుపుదల చేయడానికి ఎమ్మెల్యేతో చర్చలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, అధికారులు చర్చలు జరుపుతున్నారు. చర్చలు కొలిక్కి రాలేదు. దాంతో ధర్నాపై ఉత్కంఠ నెలకొంది.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.