అధికారుల హామీతో ఎమ్మెల్యే ధర్నా విరమణ.!
పొద్దుటూరు(జూలై, 25): పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శనివారం తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ అధికారుల హామీతో విరమించుకున్నారు. శనివారం స్థానిక R&B గెస్ట్ హౌస్ నందు విద్యుత్ శాఖ ఈఈ చాంద్ భాష, డీఈ శ్రీనివాసుల రెడ్డిలు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, పార్టీ నేతలు ముక్తియార్, ఇవి సుధాకర్ రెడ్డిలతో చర్చించారు. సబ్ స్టేషన్ స్థలం దారి సమస్య పరిష్కారం కాగానే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఎమ్మెల్యే ధర్నా విరమించుకున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.