పని ప్రదేశంలో మహిళలకు బాత్రూములు ఏర్పాటు చేయాలి: శ్రామిక మహిళ సంఘం డిమాండ్
ప్రొద్దుటూరులో కార్యాలయాలు, దుకాణాల్లో పనిచేస్తున్న మహిళలకు కనీసం బాత్రూంలు కూడా అందుబాటులో లేవని శ్రామిక మహిళ సంఘం కన్వీనర్ గుర్రమ్మ, కో-కన్వీనర్ వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ఎన్జీఓ హోంలో పొద్దుటూరు శ్రామిక మహిళ సంఘం సమావేశం జరిగింది. మహిళలకు పని ప్రదేశంలో భద్రత, కనీస వసతులు ఏర్పాటు చేయాలని సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.