యూట్యూబర్స్ అరెస్ట్.!

కడప(జూలై, 27): కడప సన్‌రైజ్ ప్రీ-స్కూల్ నిర్వాహకురాలిని కత్తితో బెదిరించి నగదు వసూలు చేసిన యూట్యూబర్స్, విద్యార్థి సంఘ నాయకులను సోమవారం కడప తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు.
➡️ కేసు వివరాలు:*
కడప తాలూకా PS Cr.No.102/2026 U/S 
➡️ అరెస్టు చేసిన ముద్దాయిల పేర్లు మరియు వివరాలు:
బుక్కే జగన్ మోహన్ నాయక్ @ జగన్ నాయక్ @ జనగణ నాయక్, వయస్సు 29 సంవత్సరాలు, S/o బుక్కే నారాయుడు నాయక్, సుగాలి, క్యాటరింగ్ వ్యాపారం, స్వస్థలం కల్లూరుపల్లి తాండా, చక్రాయపేట మండలం, ప్రస్తుతం రాజారెడ్డి వీధి, కడప టౌన్. (A-1)
నాగిపోగు ఓబయ్య, వయస్సు 34 సంవత్సరాలు, S/o N. ఓబయ్య, మాదిగ, విద్యార్థి నాయకుడు, R/o D.No.2/19, హరిజనవాడ, మల్లేపల్లి గ్రామం, బి.మఠం మండలం, కడప జిల్లా. (A-2)
చౌడవరం విజయ సాయి @ విజయ కుమార్, వయస్సు 53 సంవత్సరాలు, S/o C. సుబ్బరామయ్య, మాల, A1 న్యూస్ రిపోర్టర్, R/o D.No.1/2125, APHB కాలనీ, కడప టౌన్. (A-5)
దారా కమ్మన్న @ కంబన్న, వయస్సు 43 సంవత్సరాలు, S/o D. దేవసహాయం, మాల, సూర్య న్యూస్ విలేకరి, R/o D.No.2/675, నాగరాజుపేట, కడప టౌన్. (A-6)
సుంకు శ్యామ్ ప్రసాద్ @ శ్యామ్, వయస్సు 55 సంవత్సరాలు, S/o S. సుబ్బరాయుడు, వైశ్య, K.TV కెమెరామెన్, R/o D.No.11/25, నబీకోట, కడప టౌన్. (A-7)
*➡️ స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ 
వివరాలు:*
1. నేరానికి ఉపయోగించిన 6 అంగుళాల పొడవు గల ఒక కత్తి.
2. ఆరు రూ.500/- నోట్లు, మొత్తం రూ.3,000/- నగదు.
➡️ నేర విధానం:
ముద్దాయిలు సన్‌రైజ్ ప్రీ-స్కూల్‌కు అనుమతులు లేవనే విషయాన్ని ఆసరాగా చేసుకొని, స్కూల్ నిర్వాహకురాలిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారిలో కొందరు విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాల పేర్లు ఉపయోగించగా, మరికొందరు విలేకరులు, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులుగా కెమెరాలతో స్కూల్‌లోకి ప్రవేశించి వీడియోలు, ఫొటోలు తీసి, స్కూల్ మూయిస్తామని మరియు అంతు చూస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం