దొరసానిపల్లె హైస్కూల్ తనిఖీ చేసిన లోకేష్.!
ప్రొద్దుటూరు(జూలై,15):విద్యాశాఖ మంత్రి లోకేష్ బుధవారం ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె జడ్పీ హైస్కూల్ ఆకస్మిక తనిఖీ చేశారు. జమ్మలమడుగు పర్యటన ముగించుకొని ప్రొద్దుటూరు వస్తు దారిలో హైస్కూల్ తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. అక్కడి వసతులు, సదుపాయాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత రుచి ఆరా తీశారు. తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ప్రొద్దుటూరు వార్తలు/proddaturnews.com, Proddatur, YSR Kadapa, Andhra Pradesh.