రేపు ఎల్లుండి మంత్రి లోకేష్ జిల్లా పర్యటన.!
రాష్ట్ర మంత్రి లోకేష్ మంగళ, బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. రాత్రికి జమ్మలమడుగు మండలం కరమలవారిపల్లెలో బస్సు చేస్తారు. బుధవారం ఉదయం మైలవరం మండలంలో దాల్మియా సిమెంట్ కర్మాగారం విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం పొద్దుటూరులో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు.