మునిసిపల్ కమిషనర్ వద్దకు సబ్ స్టేషన్ సమస్య.!

ప్రొద్దుటూరు(జూలై, 25): స్థానిక శ్రీనివాసనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధికారులను డిమాండ్ చేస్తున్నారు.  సబ్ స్టేషన్ కోసం ఆయన ఆందోళనకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు ఎమ్మార్వో ఉదయభాస్కర్ సబ్ స్టేషన్ నిర్మాణ స్థలం దారి విషయమై మున్సిపల్ కమిషనర్ ను సంప్రదించాలంటూ విద్యుత్ శాఖ అధికారులకు లేఖ రాశారు.  శ్రీనివాసనగర్లోని 2.49 ఎకరాల భూమిని అప్పటి జిల్లా కలెక్టర్ మున్సిపాలిటీకి అప్పగించారన్నారు.  అందులో 30 సెంట్లు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం 
ఇచ్చారన్నారు. దారి విషయమై మున్సిపల్ అధికారులను సంప్రదించాలని ఎమ్మార్వో ఆ లేఖలో విద్యుత్ అధికారులకు సూచించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?