ఇంజనీరింగ్ ఫీజు తక్కువ.. ఆ క్లబ్బులో సభ్యత్వం ఎక్కువ.! మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు(జూలై,30): ప్రొద్దుటూరులో పేకాట విచ్చలవిడిగా సాగుతోందని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో జార్జి క్లబ్ మూయించామన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక మళ్లీ తెరిపించారన్నారు. అక్కడ పేకాట ఆడడానికి రూ.1.20 లక్షల సభ్యత్వం వసూలు చేస్తున్నారన్నారు. ఇది ఇంజనీరింగ్ ఫీజు కన్నా ఎక్కువన్నారు. పేకాట క్లబ్బులు నడిపేవారు, క్రికెట్ బుకీలు, రేషన్ బియ్యం స్మగ్లర్లు, రైతుల శనగల డబ్బులు దోపిడీ దారులు అంతా ఎమ్మెల్యే అనుచరులేనని రాచమల్లు ఆరోపించార
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.