మున్సిపల్ కమిషనర్ కు సమస్యల స్వాగతం.!

ప్రొద్దుటూరు(జూలై, 27): పొద్దుటూరు మున్సిపాలిటీకి నూతన కమిషనర్ గా వచ్చిన విశ్వనాథ్ సోమవారం ప్రజలతో సమస్యలపై ఫోన్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి 25 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు.  ప్రధానంగా పారిశుద్ధ్యం, ఆక్రమణలు, దోమలు, కుక్కలు, పందుల బెడదను కమిషనర్ దృష్టికి తెచ్చారు.  సమస్యలన్నిటిని నమోదు చేసిన కమిషనర్ సత్వర పరిష్కారం చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.
అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్, ఎంఈ శ్రీనివాసులు, ఏసీపీ కృష్ణసింగ్, మేనేజర్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.  
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం