పొట్టిపాడు రోడ్డులో నాణ్యత ఎక్కడ మహేశ్.?: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు-పొట్టిపాడు రోడ్డును ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు. తమ నిర్మాణ పనులు 15 సంవత్సరాల తర్వాత కూడా నాణ్యతగానే ఉంటాయని శనివారం టిడిపి నేత మహేశ్ రాచమల్లుకు సవాల్ చేశారు. ఈ మేరకు రాచమల్లు ఆదివారం పొట్టిపాడు రోడ్డు నాణ్యత పరిశీలించారు. నాసిరకంగా నిర్మించారని, పగుళ్లు వచ్చాయని, అధికారులు పట్టించు కోవడం లేదని రాచమల్లు ఆరోపించారు.