వారంతో ఎమ్మెల్యే వెనకే ఉన్నారు: కాంగ్రెస్ నేత
ప్రొద్దుటూరు(జూలై, 30): ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కా, భూమాపియా, నేరాలు చేసే వారంతా ఎమ్మెల్యే వెనకే ఉన్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇర్ఫాన్ భాష గురువారం మీడియా సమావేశంలో ఆరోపించారు. దాంతో అధికారులు వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. పొద్దుటూరులో అవినీతి పెరిగిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఇర్ఫాన్ డిమాండ్ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.