ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కు పాదం.!
ప్రొద్దుటూరు(జూలై, 30): ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్
హెచ్చరించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు, శానిటేషన్, ఎన్విరాన్మెంట్ అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలిస్తామని వ్యాపారులతో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.