ప్రొద్దుటూరులో చేపల వ్యాపారిపై దాడి.. నలుగురికి గాయాలు.!
ప్రొద్దుటూరు పెన్నానగర్లో ఆదివారం చేపల వ్యాపారి చిన్న మౌలాలిపై వాచర్ పుల్లయ్య 15 మందితో దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్న మౌలాలి, అతని కుమారులు మహమ్మద్, అబ్దుల్లా, సమీప బంధువ బాబా ఫక్రుద్దీన్ గాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. జూటూరు మహమ్మద్ భాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు స్థానిక 1-టౌన్ సిఐ కొండారెడ్డి తెలిపారు.