గురువారం ప్రొద్దుటూరు డ్రైవర్ కొట్టాలలో ఉచిత టిబి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డా.మధు కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ జరిగింది. మందులు పంపిణీ చేశారు.
కడప: వాణిజ్యపరంగా కీలకమైన ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేసీ డా. నిధిమీనా, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పట్టణంతో పాటు పరిసర గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు పట్టణాన్ని పరిసర గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించే రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్ర...
ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో బంగారు వ్యాపారులు, గుమస్తాలు, బంగారు నగల తయారీ కార్మికులతో శనివారం స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమావేశమయ్యారు. వ్యాపారాలు, సమస్యలు, పనుల గురించి వారితో చర్చించారు. ఆన్లైన్, కార్పోరేట్ కంపెనీల రాకతో వ్యాపారాలు పడిపోయాయని జ్యూవెలరీ అసోసియేషన్ అధ్యక్షుడు కొప్పర్తి మధుసూదన్ తెలిపారు. AI కంప్యూటర్ మోడల్ తయారీతో పనులు తగ్గిపోయాయని గోల్డ్ స్మిత్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ వాపోయారు. స్థానిక వ్యాపారులకు తాను అండగా ఉంటానని అమ్మవారి సాక్షిగా MLA వరదరాజుల రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో కార్యక్రమాలకు మా ర్కెట్ యార్డు కాంపౌండ్ గోడను తొలగించారు. ఆ తర్వాత ఎవ్వరూ పట్టించు కోలేదు. ఈ పరిస్థితుల్లో యార్డు గోడౌన్లోని రూ.1.70 కోట్ల హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐరన్ మాయమైంది. వీటిపై శనివారం స్థానిక MLA వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు AMC చైర్మన్ లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, సెక్రటరీ రత్నరాజు పరిశీలించారు. చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.