నకిలీ బంగారం విక్రయించిన కన్నయ్య అరెస్ట్.!
ప్రొద్దుటూరు(జూలై,26): తక్కువ ధరకే బంగారం ఇస్తామనే వారిపట్ల మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ ప్రజలకు సూచించారు.
*తిరుపతి జిల్లా పుత్తూరు మండలం వినాయకపురం గ్రామానికి చెందిన కన్నయ్య@ప్రసాద్ నుంచి ప్రొద్దుటూరు టౌన్ వసంతపేటకు చెందిన బెల్లాల రవికుమార్ రూ.6.50 లక్షలకు 100 గ్రాముల బంగారు కడ్డీ కొన్నాడు. ప్రొద్దుటూరుకు వచ్చి పరీక్షించగా నకిలీగా తేలింది. ఈ మేరకు బాధితుడు రవికుమార్ ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీసులకు పిర్యాదు చేశాడు. సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఆదివారం కన్నయ్యను అరెస్ట్ చేశారు. 4 బంగారు పూత పూసిన కడ్డీలు, ల్యాప్ టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.