మాకు ఉచిత కరెంట్ కావాలి.!
ప్రొద్దుటూరు(జూలై, 21): తమకు ఉచిత విద్యుత్ ఇప్పించాలని ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘం నేతలు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం పలు వృత్తుల వారికి ఉచిత విద్యుత్ అందిస్తోందని, తమకు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని వారు కోరారు.