ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ది సురేఖ రాజీనామా.?
ప్రొద్దుటూరు(జూలై, 27): ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ది సురేఖ గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సురేఖ భర్త వద్ది బాలుడు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వారు వారించినప్పటికీ రాజీనామాకు సురేఖ కుటుంబం సిద్ధమైనట్లు తెలిసింది.
వద్ది సురేఖ రాజీనామాను ఆమోదిస్తే, వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ ఇంచార్జ్ బాధ్యతలు చూడాల్సి ఉంటుంది.
సురేఖ పదవీకాలం ఆగస్టులో ముగియనుంది. ఏఎంసీల చట్టం ప్రకారం ఆరు నెలలు చొప్పున రెండుసార్లు మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగించవచ్చు. దీంతో తదుపరి చైర్మన్ ఎవరనే దానిపై టిడిపిలో చర్చ జరుగుతోంది.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.