నేడు ఎమ్మెల్యే ధర్నా ఉంటుందా.?
ప్రొద్దుటూరు(జూలై, 25): ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నేటి ధర్నాపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. టిడిపి నేతలు, కార్యకర్తలు, వరదరాజుల రెడ్డి అభిమానులు నేటి ధర్నాకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఇప్పటివరకు ధర్నా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడ లేదు. ప్రతిరోజు ప్రొద్దుటూరు కార్యాలయానికి ఉదయం 10 గంటలకు వచ్చే ఎమ్మెల్యే నేడు 8.30 గంటలకు వస్తుండడంతో ధర్నా కొనసాగుతుందని భావిస్తున్నారు. దాంతో ముందుగా ప్రకటించిన మేరకు ధర్నా ఉంటుందని ముఖ్య నేతలు అంటున్నారు. పోలీసులు, అధికారులు ధర్నాపై టెన్షన్ పడుతున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.