ప్రభుత్వ పథకాల అమలుపై కార్యకర్తలతో లోకేష్ సమీక్ష: ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు, జూలై 14: ప్రభుత్వ పనితీరు, సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుపై సమీక్షించడానికి బుధవారం టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రొద్దుటూరు వస్తున్నట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. లోకేష్ పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. నేతలు, కార్యకర్తలు సమావేశానికి తప్పక హాజరు కావాలన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు/proddaturnew.com, Proddatur, YSR Kadapa, Andhra Pradesh.