ప్రొద్దుటూరులో ధర్నాలు, నిరసనలు.!
ప్రొద్దుటూరు(జూలై, 24): ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ, శుక్రవారం ప్రొద్దుటూరులో విద్యార్థి, యువజన, కార్మిక, ప్రజా సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపట్టాయి. పుట్టపర్తి సర్కిల్, విజయకుమార్ సర్కిల్లో ప్రజా సంఘాలు ధర్నా చేశాయి. పలు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల వద్ద విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur, YSR Kadapa District, Andhra Pradesh | Local News.