స్టాంప్ రైటర్స్ ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు.!
ప్రొద్దుటూరు(జూలై,21) స్టాంప్ రైటర్స్ నిరసన దీక్షకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మంగళవారం ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పెన్ డౌన్ సమ్మె చేస్తున్న స్టాంప్ రైటర్స్ దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరిస్తే ప్రజల ఆస్తులకు భద్రత ఉండదన్నారు.