తెలుగుభాష పరిణామక్రమాన్ని తెలిపే కలమల్ల శాసనం: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి
ఎర్రగుంట్ల మండలం కలమల్ల చెన్నకేశవ సిద్దేశ్వరాలయాన్ని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సందర్శించారు. అక్కడి మొదటి తెలుగు రాతి శాసనాలను పరిశీలించారు. రేనాటి చోళరాజు ధనుంజయుడు ఈ శాసనాన్ని వేయించాడు. అచ్చమైన తెలుగు భాషలో వాక్యాలు ఉన్నాయన్నారు. తెలుగు భాష అబివృద్ధి పరిణామక్రమాన్ని వీటి ద్వారా తెలుసుకోవచ్చన్నారు.