ప్రొద్దుటూరు(జూలై, 27): స్థానిక కొత్తపల్లె పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేయాలని టిడిపికి చెందిన లింగాపురం బ్యాంక్ చైర్మన్ నాగముని రెడ్డి, సినీహబ్ రాజేశ్వరరెడ్డి సూచించారు. వారు సోమవారం పొద్దుటూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మునిసిపల్ కార్పొరేషన్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. అభివృద్ధి జరుగుతుందన్నారు. కరెప్షన్ తగ్గుతుందన్నారు. ప్రజలంతా విలీనానికి మద్దతుగా ఉన్నారు. కొంతమంది అభివృద్ధి నిరోధకుల ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.
పొద్దుటూరు(జూలై, 22): స్థానిక శ్రీనివాసనగర్ వివాదాస్పద విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని బుధవారం విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. స్థల వివాదంపై ఆరా తీశారు. 80% పూర్తయిన సబ్ స్టేషన్ నిర్మాణం పనులను అధికారులు ఆపారు. మిగతా 20% పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ప్రారంభించాలంటూ స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఈనెల 25న ధర్నాకు పిలుపునిచ్చారు. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.
కడప(జూలై,14): FAPTO ఆధ్వర్యంలో మంగళవారం కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాడు ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాద్యాయులకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని విమర్శించారు. -:ప్రొద్దుటూరు వార్తలు, Proddatur, YSR Kadapa, Andhra Pradesh.