ఆధార్ కార్డు తెచ్చుకుంటే రూ.500లు.!

ప్రొద్దుటూరు(జూలై, 27): కొత్తపల్లె పంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామసభ నిర్వహిస్తున్నారు.  పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం కోసం గ్రామసభను నిర్వహిస్తున్నారు.  విలీనానికి మద్దతుగా MLA వరదరాజుల రెడ్డి వర్గీయులు, వ్యతిరేకంగా మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి వర్గీయులు జనసమీకరణ చేస్తున్నారు.   ఆధార్ కార్డుతో వచ్చి తమకు అనుకూలంగా ఓటేస్తే రూ.500లు ఇస్తామంటూ జన సమీకరణ చేస్తున్నారు.  దీంతో కొత్తపల్లె పంచాయతీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం