టెట్ పరీక్షలకు 11,780 మంది దరఖాస్తు.!
కడప(జూలై, 30): కడప జిల్లాలో టెట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం కడప డిఆర్ఓ మల్లికార్జున, డీఈవో షంషుద్దీన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో టెట్ పరీక్షలకు 11,780 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 5 నుంచి 16 వరకు రెండు విడతల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కడపలో 5, ప్రొద్దుటూరులో 2, రాజంపేటలో 1 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.