ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై POCSO కేసు నమోదు.!

ప్రొద్దుటూరు ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ కొ ఎడ్యుకేషన్ స్కూల్ మ్యాథ్స్ టీచర్ నరసింహారెడ్డిపై POCSO కేసు నమోదు చేసినట్లు స్థానిక 1టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు.  ఎస్సై వివరాల మేరకు.. ఫిర్యాది ప్రొద్దుటూరు ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ కో-ఎడ్యుకేషన్ స్కూల్ నందు 10 వ తరగతి చదువుతోంది.  మ్యాథ్స్ సబ్జెక్టు టీచర్ నరసింహ రెడ్డి 13.08.2026వ తేదీన సుమారు 10.30 AM గంటల సమయములో ఫిర్యాదిని స్టాఫ్ రూముకు రమ్మని పిలవగా,  ఫిర్యాదికి క్లాస్ ఉన్నందున తర్వాత మద్యాహ్నం 02.00 PM గంటల సమయములో ఫిర్యాది మరియు స్నేహితురాలు కలసి స్టాఫ్ రూమ్ వద్దకు పోగా నరసింహ రెడ్డి నిద్రపోతున్నాడని తెలిసి తిరిగి క్లాస్ రూముకు వెళ్లారు.  తర్వాత ఫిర్యాది మద్యాహ్నం సుమారు 03.00 PM గంటల సమయములో తన స్నేహితురాలితో కలసి నరసింహరెడ్డి దగ్గరికి పోగా ఫిర్యాదితో పాటు వచ్చిన తన స్నేహితురాలిని నిన్ను ఎవరు రమ్మనారని, ఫిర్యాదిని కొట్టడానికి రమ్మన్నాను, నిన్ను కూడా కొట్టలా అని అరవగా ఫిర్యాది స్నేహితురాలు అక్కడ నుండి వెళ్ళిపోయింది.  తర్వాత నరసింహ రెడ్డి ఫిర్యాది చేయి పట్టుకొని నీకు మాటలు ఎక్కువయ్యాయి అని చెప్పినట్లు, అంతటా ఫిర్యాది సార్ నేను మాటలు తగ్గించుకుoటాను అని చెబుతుండగా నరసింహ రెడ్డి ఫిర్యాది వెనుక వైపు చేయి వేయగా, ఫిర్యాది కొంచెం దూరము జరిగినట్లు, అయినా కూడా ఫిర్యాదిని ముందుకు లాగి ఫిర్యాది ముందు వైపు తాకి, కౌగలయించు కోవడానికి ప్రయత్నిoచగా, ఫిర్యాది నరసింహ రెడడ్డని ముందుకు తోసి, విడిపించుకొని అక్కడ నుండి పారిపోయి ఏడుస్తూ బయటకు వచ్చి, అక్కడే బయట ఉన్న రాఘవయ్య గురుజి ఫోన్ తీసుకొని, ఫిర్యాది తన పిన్నికి ఫోన్ చేసి విషయము చెప్పినట్లు, తర్వాత ఫిర్యాది పిన్ని స్కూల్ దగ్గరకు పోయి ఫిర్యాదిని ఇంటికి పిలుచుకొని వచ్చినట్లు, తర్వాత ఫిర్యాది పిన్ని వాళ్ళు తమ బoదువులతో మాట్లాడుకొని పోలీస్ స్టేషన్లో జరిగిన విషయము చెప్పారు. ఇంకొక అమ్మాయిపై ఇలా జరగకుండా నరసింహ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోమని రాబడిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు Proddatur 1 town PS Cr.No.222/2026 U/s U/S 75 BNS,Section 9 r/w 10 of POCSO Act-2012 కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు.