ప్రొద్దుటూరులో టిడిపికి షాక్.!

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన టిడిపి సీనియర్ నేత సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి, అనుచరులు నామినేటెడ్ పదవులకు, పార్టీ సభ్యత్వాలకు శనివారం రాజీనామా చేశారు.  రాజీనామా లేఖలను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు, ముఖ్య నేతలకు వాట్సాప్ ద్వారా పంపారు.  రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ నాగముని రెడ్డితో సంప్రదింపులు చేస్తున్నారు.  ఈ సందర్భంగా నాగముని రెడ్డి మాట్లాడుతూ.. లింగాపురం రైతు సేవ సహకార బ్యాంక్ చైర్మన్ పదవికి, టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు.  కొంతకాలంగా స్థానిక పార్టీ నాయకత్వం కొత్తపల్లె పంచాయతీలో తనను దూరంగా పెట్టినట్లు ఆయన భావిస్తున్నారు.  ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో తనను సంప్రదించకపోవడంపై ఆయన అసంతృప్తిలో ఉన్నారు.  ఈ మేరకు ఆయన పార్టీకి రాజీనామా చేశారు.