MVR కుటుంబానికి పోరాడటం కొత్తకాదు: ఉమ మురళి

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ MVR తమకు పోరాడటం నేర్పారని, కొత్తపల్లె పంచాయితీలో తాము పోరాటం చేస్తామని ఆయన కుమారుడు మురళీ, కోడలు ఉమ తెలిపారు.  వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కొత్తపల్లె పంచాయితీలో సర్పంచ్, 20 వార్డులకు గాను, 6 వార్డులకు మాత్రమే తమ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ఆమోదించారన్నారు.  ఎంతో పోరాటం చేశాకే ఆ 6 వార్డుల్లో తమ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయన్నారు.
వారితోనే తాము ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తామన్నారు.