తాళ్ళమాపురంలో MPTC ఎన్నికలు.!
ప్రొద్దుటూరు మండలం తాళ్ళమాపురం MPTC స్థానానికి రేపు గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. తాళ్ళమాపురం ZP హైస్కూల్లో 3, మూలవారిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. బుధవారం MPDO కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. RO కృష్ణ, MRO ఉదయ భాస్కర్ రాజు, MPDO సూర్యనారాయణ రెడ్డి, DT అజయ్ బాబు, MPDO కార్యాలయం AO బాలన్న ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక బస్సులో సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.