లంచం డిమాండ్ చేస్తే చర్యలు:MLA వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు స్కానింగ్, X-ray, ల్యాబ్ పరీక్షలు ఆస్పత్రిలోనే చేయాలని ఆదేశించారు.  ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొద్దన్నారు.  రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ బాబు పాల్గొన్నారు.