జడ్పీ చైర్మన్ మార్పు ఎక్కడ జరిగిందో.. బయటికి తీస్తా:MLA ఆదినారాయణ రెడ్డి

విజయవాడ: కడప జడ్పీ చైర్మన్ పదవి తన తమ్ముని కుమారునికి ఇస్తామని చెప్పి.. ఇవ్వకపోవడం ఏమిటంటూ జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బిజెపి, టిడిపి నేతలను ప్రశ్నించారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. తన తమ్ముని కుమారులు యువకులని, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, జెడ్పిటిసి సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, జడ్పీ చైర్మన్ ఇస్తామని చెప్పడంతోనే వారిని పోటీలోకి దించానని, అభ్యర్థుల మార్పు ఎవరు చేశారనే దాన్ని బయటికి తీస్తానన్నారు. తన రాజీనామాపై రేపు వెల్లడిస్తానన్నారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.