ఫోర్జరీ లేఖపై పోలీసులకు ఫిర్యాదు:MLA వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని బీసీలకు ఇవ్వొద్దని తాను ప్రభుత్వానికి ఎటువంటి లేఖ రాయలేదని ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక మాజీ MLA రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిన్న మీడియాకు విడుదల చేసిన లేఖ తనది కాదని స్పష్టం చేశారు. ఫోర్జరీ లేఖను రాచమల్లు సృష్టించారని MLA ఆరోపించారు. బీసీల అభివృద్ధిని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానన్నారు. ఫోర్జరీ లేఖ సృష్టించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రాచమల్లుకు మొదటి నుంచి ఫోర్జరీ పత్రాలతో ఆస్తులు కొట్టేయడం అలవాటే నన్నారు. RTO, CTO వేషాలతో గతంలో ప్రజల నుంచి డబ్బులు దోచుకున్నాడని ఆరోపించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.