వైద్య సేవల్లో 'సంజీవిని' :DMHO

ప్రొద్దుటూరు: వైద్య సేవలను డిజిటల్ సాంకేతికతతో అనుసంధానించి, ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించడమే సంజీవిని లక్ష్యమని DMHO యుగంధర్ తెలిపారు.  జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం మొదటి బ్యాచ్ బుధవారం ప్రొద్దుటూరులోని SRIT ఇంజనీరింగ్ కళాశాలలో 
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వైద్యాధికారులు, సంజీవని మిత్రలకు నిర్వహిస్తున్న లక్ష్యాలు, CareX డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోని వివిధ మాడ్యూల్స్, వాటి వినియోగ విధానం, రోగుల సేవల సమన్వయం, రిఫరల్ సేవలు తదితర అంశాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి. గీత, జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అధికారి డాక్టర్ మహమ్మద్ తాహా. టాటా ఎండీ సంస్థ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్టులు కుమారి గీతిక, డా.మాధురి పాల్గొన్నారు.