ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ స్కాంపై CDMA విచారణ.?
విజయవాడ: రూ.1.63 కోట్ల ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ స్కాంపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ డైరెక్టర్ (CDMA) దృష్టికి వెళ్ళింది. ఆయన విచారణ చేపట్టినట్లు తెలిసింది.
*ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ నిర్వహణను రూ.1.85(+18%GST) కోట్లకు వేలంలో కాంట్రాక్టర్ శివకుమార్ దక్కించుకున్నారు. పూర్తి అమౌంట్, బ్యాంక్ గ్యారంటీ తీసుకోకుండానే ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కమిషనర్ కాంట్రాక్టర్ కు అప్పగించారు. కాంట్రాక్టర్ కేవలం రూ.55 లక్షలు మాత్రమే చెల్లించి, మిగతా రూ.1.63 కోట్లు గండి కొట్టాడు. కమిషనర్, కాంట్రాక్టర్ లాలూచి పడి మున్సిపల్ ఖజానాకు రూ.1.63 కోట్లు నష్టం కలిగించారని టిడిపి నేత ఉక్కు ప్రవీణ్, వైసీపీ నేత బంగారెడ్డి, కాంగ్రెస్ నేత గోసంగి సుబ్బారెడ్డి, ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తదితరులు ప్రభుత్వానికి పిర్యాదు చేశారు. ఎగ్జిబిషన్ అమౌంట్ ఎగవేతలో కమిషనర్ కు పెద్ద మొత్తంలో ముట్టిందని ఆరోపించారు. దీనిపై శనివారం మున్సిపల్ ఆర్డీ నాగరాజు మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ను అనంతపురం పిలిపించి విచారించారు. ఆమేరకు CDMA ఎగ్జిబిషన్ స్కాంపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.