కోగటం సర్పంచ్ గా ఉక్కు ప్రవీణ్ తల్లి విజయం.!
కమలాపురం మండలం కోగటం పంచాయతీ సర్పంచ్ గా ప్రొద్దుటూరు టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తల్లి పద్మావతమ్మ విజయం సాధించారు. ఈమేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమెకు డిక్లరేషన్ ఫారం అందజేశారు. ప్రమాణం చేయించారు. భర్త ప్రతాప్ రెడ్డి, కుమారుడు ప్రవీణ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కోగటం పంచాయితీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జెడ్పీ చైర్మన్ నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. ఛాలెంజ్ విసురుకున్నారు. కాగా.. ఇక్కడ పద్మావతమ్మ విజయం సాధించారు.