నామినేషన్లకు అడ్డంకులు లేవు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రెండు రోజులుగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకోవచ్చని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియపై ప్రజల్లో అనవసర అపోహలు సృష్టించవద్దని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఆయన సూచించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొని నామినేషన్లు దాఖలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.