కలెక్టరే నామినేషన్లు చెల్లకుండా చేశారు: రాచమల్లు
ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎన్నికల అధికారులు వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు చెల్లకుండా చేశారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు, పోలీసులు, టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. టీడీపీకి తొత్తులుగా పనిచేశారని ఆరోపించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.