ప్రొద్దుటూరులో మెడికల్ సెంటర్లు సీజ్.!

ప్రొద్దుటూరులోని మెడికల్ స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్ లపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.  ప్రభుత్వ అనుమతులు లేకుండా రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబ్ లను సీజ్ చేశారు.  స్థానిక జమ్మలమడుగురోడ్డులోని అపోలో శీను స్కానింగ్ సెంటర్, హోమస్పేటలోని ల్యాబ్ ను మూయించారు.  వాటిని సీజ్ చేశారు.  పట్టణంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారంతో ఇతర అనుమతులు లేని ప్రైవేట్ ల్యాబులు మూశారు.  జమ్మలమడుగు డిప్యూటీ DMHO డా, గీత, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.