ప్రొద్దుటూరు కమిషనర్.. ఇదేం పిచ్చి నీకు: ఇర్ఫాన్ బాషా

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ రీల్స్ మాస్టర్, పబ్లిసిటీ పిచ్చి, ఏ పనిచేసినా సోషియల్ మీడియాలో ట్రెండ్ కావాలంటాడని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇర్ఫాన్ బాషా విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కమిషనర్ తన చేష్టలతో చంద్రబాబు, జగన్ దృష్టిలో పడి ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం అవుతానంటూ ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. అదే ఆలోచనలో ఉంటే ఉద్యోగం వదలి రాజకీయాల్లో చేరొచ్చన్నారు.