ఎగ్జిబిషన్ బాకీపై కలెక్టర్ చర్యలు తీసుకోరా.?: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ బకాయి రూ.1.63 కోట్లు వసూలు బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్దేనని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. మొదటి నుంచి ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ పంచాయతీని మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ వద్దే ఉంచాడన్నారు. నిజాయితీ కలిగిన మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ జేసీకి ఇందులో సంబంధం లేదన్నారు.