ఎగ్జిబిషన్ స్కాంపై ఆర్డీ విచారణ.?
ప్రొద్దుటూరు: రూ.1.63 కోట్ల ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ స్కాంపై అనంతపురం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు విచారణ చేపట్టారు. శనివారం ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ ఎగ్జిబిషన్ ఫైళ్ళను తీసుకొని ఆర్డీ కార్యాలయానికి వెళ్లారు. గెజిట్ నిబంధనల మేరకు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ నుంచి ముందుగానే పూర్తి అమౌంట్ వసూలు చేయకపోవడంపై ఆర్డీ ప్రశ్నించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ రూ.1.63 కోట్లు చెల్లించకపోతే, అందుకు బాధ్యులెవరంటూ ఆర్డీ నిలదీసినట్లు తెలిసింది. ఎగ్జిబిషన్ స్కాంపై ప్రభుత్వానికి, CDMA అధికారులకు పిర్యాదులు వెళ్లాయి. దాంతో ఆర్డీ విచారణ చేపట్టారు. ఆర్దీ నాగరాజును వివరణ కోరగా.. కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ తనను కలిశారని తెలిపారు.