ప్రొద్దుటూరులో మొదటిరోజు నామినేషన్లు ఎన్నంటే.?
ప్రొద్దుటూరు మండలంలో 15 పంచాయతీలకు సంబంధించి మొదటిరోజు శనివారం సర్పంచ్ పదవులకు 32, వార్డు స్థానాలకు 165 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎండిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
*గోపవరం-2, కొత్తపల్లి-2, సోములవారిపల్లె-2, పెద్దశెట్టిపల్లి-3, చౌటపల్లె-2, దొరసానిపల్లె-2, చౌడూరు-3, కాకిరేనిపల్లె-3 తతళ్లమాపురం-2, కల్లూరు-2, నంగనూరిపల్లె-4, సీతంపల్లె-2, కామనూరు-2, చెన్నంరాజుపల్లె-1 నామినేషన్లు దాఖలయ్యాయి.
*రాజుపాలెం మండలంలో 15 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. శనివారం మొదటి రోజున సర్పంచ్ స్థానాలకు 42, వార్డుల స్థానాలకు 131 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడీవో సురేష్ బాబు తెలిపారు. ఎస్సై ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.