కొత్తపల్లె నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టుకు.!
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయితీలో వైసీపీ
నుంచి సర్పంచ్ అభ్యర్థి వీరమ్మతో పాటు, 17 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీలో సర్పంచ్ మరియు 14 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. ఆర్ఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరు బుధవారం ఆర్డీఓ వద్ద అప్పీల్ చేశారు. అప్పీల్ అధికారి ఆర్డీఓ శిరీష వద్ద అప్పీలుదారులు, ఆర్ఓ గీరీశ్వరరావు రికార్డులను సమర్పించి, వాదనలు వినిపించారు. రేపు నిర్ణయం వెలువడనుంది. హైకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తామని తెలిపారు.